హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 12: తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెలలో విడుదల చేసిన ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కి అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు బోర్డు తెలిపింది. గత నెలలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌కు ఇప్పుడు అదనంగా మరో 272 పోస్టులను జత చేసింది. దీనితో మొత్తం భర్తీ చేయనున్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 2,322కి చేరాయి. ఈ నెల 14లోగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాని బోర్డు సూచించింది. నవంబర్ 17న కంప్యూటర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. అదే విధంగా గతంలో ప్రకటించిన 633 ఫార్మసిస్ట్ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులను కలుపుతూ తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మొత్తం ఫార్మసిస్ట్ పోస్టుల సంఖ్య 732కి చేరింది. ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించి ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 30న పరీక్ష నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది.