సీఎం రేవంత్‌ సొంత గ్రామానికి దసరా కానుకలు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 10: దసరా పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి వస్తుండడంతో కొండారెడ్డిపల్లితో పాటు వంగూరు మండలంలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టడంపై అధికారులు దృష్టి సారించారు. వంగూరు మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలకు డబుల్ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే రూ. 30 కోట్లు మంజూరు కాగా మరో రూ.170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపారు. గత నెల రోజుల నుండి పనులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment