పోలీస్ స్టేషన్లోనే మహిళా పోలీసుకు రక్షణ కరువు..
ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యయత్నం..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 10: మెదక్ – చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సై యాదగిరి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళా ఏఎస్సై సుధారాణి. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా విధులకు హాజరు కానట్లు కానిస్టేబుల్స్ తో అబ్సెంట్లు వేయిస్తున్నట్లు తెలిపిన ఏఎస్సై సుధారాణి. కావాలని ఎస్సై యాదగిరి కక్షపూరితంగా దుర్భాషలడుతూ తనను మానసికంగా వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం చేసిన సుధారాణి. చికిత్స కోసం జోగిపేట ఆసుపత్రికి తరలింపు.