హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 09: హైదరాబాద్ శివార్లులోని మణికొండ మున్సిపల్ కార్యాలయంలో డీఈఈ గా ఉద్యోగం నిర్వహిస్తున్న దివ్యజ్యోతి ఓ కాంట్రాక్టర్ల నుంచి లంచంగా తీసుకుంటుండగా తన కట్టుకున్న భర్త అయి కూడా ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి మరీ పట్టించాడు.
అవినీతిగా తీసుకున్న నగదును ఇంట్లో ఎక్కడ పడితే అక్క పెడుతుందని భర్త శ్రీపాద్ తెలిపారు. బీరువాలో, పరుపు కింద దేవుని గుడిలో కిచెన్ లో పూల కుండీలో ఎక్కడ పడితే అక్కడే పేపర్లో చుట్టిన నోట్ల కట్టలతో ఉన్న వీడియోను భర్త శ్రీపాద్ బయట పెట్టాడు.
లంచం తీసుకోవడంపై భార్యాభర్తల మధ్య చాలా సార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. అయినా తీరు మార్చుకోక పోవడంతో లంచగొండి భార్యను అధికారులకు పట్టించాడు.