హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/అక్టోబర్ 09: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో కిడ్నాప్‌కు గురైన సైనికుడి మృతదేహం స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. గత రాత్రి అనంత్‌నాగ్ లోని అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్స్‌లో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు సైనికుల్లో హిలాల్ అహ్మద్ భట్ కూడా ఉన్నాడు. ఒక జవాన్ తప్పించుకోగా, కోకెర్‌నాగ్ లోని కజ్వాన్ అటవీ ప్రాంతంలో భట్ మృత దేహం లభ్యమైందని పేర్కోన్నారు.