తహసిల్దార్ జయశ్రీ అరెస్ట్, రిమాండ్..!!

Get real time updates directly on you device, subscribe now.

సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ రైతుబంధు కుంభకోణం..

14 రోజుల రిమాండ్ తరలింపు.

హ్యూమన్ రైట్స్ టుడే/సూర్యాపేట/అక్టోబర్ 09: సూర్యాపేట జిల్లాలో గతంలో హుజూర్నగర్ తాసిల్దారుగా పనిచేస్తూ రైతుబందు కుంభకోణానికి పాల్పడ్డ తాసిల్దార్ జయశ్రీ ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తాసిల్దార్ గా పనిచేస్తున్నరు. గత ప్రభుత్వంలో రైతుబంధు పథకంలో భాగంగా ధరణి ఆపరేటర్ సహకారంతో ఇద్దరు కలిసి రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు మింగిన మింగేసిన విషయం వెలుగులోచివచ్చింది. కేసు నమోదు అయిన తర్వాత విచారణలో భాగంగా ఎవరూ చేయలేని పనిని చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఘనత ఈ తహశీల్దార్ జయశ్రీ ది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం నిజమని నిర్ధారణ జరిగి ఈ క్రింది విధంగా కేసు నమోదు చేశారు. అలాగే తహశీల్దార్ జయశ్రీ కి 14 రోజుల రిమాండ్ విధించారని సమాచారం.

ధరణి ఆపరేటర్ జగదీష్, అరెస్ట్ రిమాండ్..

హుజూర్నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రైతుబంధు నిధులు స్వాహా.

రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు మింగిన తహసిల్దార్, ధరణి ఆపరేటర్.

ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసు బుక్కులు జారీ చేసిన తహసిల్దార్ జయశ్రీ.

తహసిల్దార్ – పట్టాదారులు 50-50 రేషియోలో రైతు బంధు నదులు పంచుకున్న వైనం.

తహసిల్దార్ పై 420,406,409,120(b),468,467 IPC సెక్షన్లు క్రింద కేసు నమోదు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment