మహరాష్ట్రలోని ఈ గ్రామంలో దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజిస్తారు..
ఈ ఆనవాయితీ 300 ఏళ్లుగా కొనసాగుతోంది..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 08: మహరాష్ట్రలోని ఈ గ్రామంలో దసరా రోజు రావణుడిని 300 యేళ్ళుగా దేవుడిగా పూజిస్తారు. అయితే దసరా రోజు భారత్‌లో రావణాసురుడి బొమ్మల్ని దగ్ధం చేస్తుంటారు. కానీ మహరాష్ట్రలోని అకోలా జిల్లా సంగోలా గ్రామంలో మాత్రం దసరా నాడు దశ కంఠుడి నిలువెత్తు రూపాల్ని చేసి, ప్రజలు అందరూ మంగళ హారతులతో ఒక దగ్గర చేరి దశ ముఖుడిని పూజిస్తారు. ఈ ఆనవాయితీ 300 ఏళ్లుగా కొనసాగుతోంది. అంతేకాదు, ఆ ఊరి మధ్యలో నల్లరాయితో చేసిన పెద్ద రావణుడి విగ్రహం కూడా ఉంది.