ఆర్టికల్స్ 19(1)(ఎ), 19(2) ఏం చెపుతోంది..!!

Get real time updates directly on you device, subscribe now.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19(1)(ఎ), 19(2) పై వ్యాఖ్యానము

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 08: వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వాతంత్ర్యము Freedom of Speech and Expression ద్వారా, రాతల : వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వాతంత్ర్యము అనగా, పౌరుడు నోటి మాటల ద్వారా, ముద్రణ ద్వారా బొమ్మలు ప్రదర్శించుట లేదా ఇతర పద్ధతుల ద్వారా తన మనో భావాలను, స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు అని అర్ధము. ఈ హక్కులను, రాజ్యాంగములో 19(1) (ఎ) వ ఆర్టికలు వ్యక్తులకు ప్రసాదిస్తున్నది. అయితే, ఈ రాజ్యాంగమే, 19(2) వ ఆర్థికల ద్వారా ఈ హక్కుల పై కొన్ని పరిమితులను / ఆంక్షలను / నిర్బంధాలను విధిస్తున్నది. ఈ హక్కులకు భౌగోళిక హద్దులంటూ ఏవి లేవు. ఈ హక్కులను భారతదేశంలో మాత్రమే కాకుండా, దేశం వెలువల కూడ వినియోగించవచ్చును.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment