హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్ జిల్లా:
మహబూబాబాద్ జిల్లా గూడూర్ మండలం గూడూరు నుండి స్టేషన్ నెక్కొండ కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంక్ లో బానోత్ ఖలో అనే రాములు తండా నివాసి 120 రూపాయల పెట్రోల్ లీటర్ పావు థమ్స ఆఫు బాటిల్ లో పోసుకున్నాడు. పెట్రోల్ తక్కువ వచ్చిందని గూడూరు కొచ్చి ఇండియన్ పెట్రోల్ బంకులో 120 రూపాయల పెట్రోలు లీటర్ పావు థమ్స్ అప్ బాటిల్లో పోసుకున్నాడు రెండు బాటీలు సమానమే ఉన్నాయి. రెండు బాటిల్లో పోసుకున్న పెట్రోలు 120 రూపాయలు పెట్రోలు మాత్రం సుమారు 200 ml తక్కువగా ఉంది అని ఎస్సార్ పెట్రోల్ బంక్ యజమాని నల్ల మహేందర్ దగ్గరికి వెళ్లగా ఎవ్వరితో చెప్పకు నీకు బాటిల్ నిండా పిట్రోల్ పోస్తా అని బత్తిలాడడు పెట్రోలు ధరలు పెరుగుతున్నటువంటి ఈ దినాలలో 200 ml తేడా వచింది. ఇంతకు ముందు అన్ని పిట్రోల్ బంకుల కన్నా ధర కూడా ఎస్సార్ పిట్రోలు బంకులో ఎక్కావగా ఉండేది ఎస్సార్ పెట్రోల్ బంకులో రోజుకు ఎంతో మంది పిట్రోల్ పోసుకుంటారు వారందరిని ఇరీతిగా మోసము చేస్తున్న యాజమాన్యమును చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పిట్రోలు బంకును రద్దు చెయ్యాలని బానోత్ ఖలో వాపోయాడు.