ఒక్కో రేషన్ షాపు డీలర్ కి రూ. 2 లక్షల నుండి రూ. 4 లక్షల

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/క్రైం/అక్టోబర్ 08: నిజామాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకం పూర్తీగా హ్యూమన్ రైట్స్ టుడే మీడియా చెప్పినట్టే జరిగింది. లోకల్ లీడర్ల జేబులు నింపుకొని అనర్హులకు కేటాయింపు. అవినీతిని అడ్డుకోవాల్సిన అధికారులు ఎంఎల్ఏ లోకల్ లీడర్లు కుమ్మక్కై ఒక్కో రేషన్ షాపు డీలర్ వద్ద రూ. 2 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు వసూళ్లు చేసినట్టు సమాచారం. ఒక్కో రేషన్ షాపు డీలర్ వద్ద తీసుకున్నట్టు లోకల్ అధికార పార్టీ నేతలే ఒప్పుకున్నట్టు కూడా బాధిత అభ్యర్థులు చెపుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రేషన్ షాపు డీలర్ల పేర్లు అర్హత పరీక్ష కు ముందే RDO కి అందించినట్టు, పరీక్షను నామ మాత్రంగా నిర్వహించి, పరీక్ష రాసిన వాళ్ల పేపర్ల కరెక్షన్ చేసిన మార్కుల జాబితా ప్రకటించకుండా, నియమకపు ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేయకుండా అందులో నుండి కొందరి 5 గురి పేర్లు నామ మాత్రంగా ప్రకటించి ఇంటర్వూ కి పిలవడం విడ్డూరం. ఇంటర్వూ లో కూడా కళ్లముందే మోసం చేసిన అధికారులు. ఇంటర్వూ లో కనీసం మాట్లాడలేని వారిని ప్రకటించడం జరిగింది. నిజామాబాద్ రూరల్ లో ఉన్న రేషన్ షాపు డీలర్ల నియామకం పూర్తీగా డబ్బులకు అమ్ముడయ్యాయని వాటికి అధికారులు ఎంఎల్ఏ లోకల్ లీడర్లు కుమ్మక్కై ఒక్కో రేషన్ షాపు డీలర్ వద్ద రూ. 2 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు వసూళ్లు చేసినట్టు ఎంఎల్ఏ ముందుగానే మాట ఇచ్చామని చెప్పడం గమనార్హం. బహిరంగంగా అవినీతి జరిగింది అని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అని గత వారంలో వార్తల్లో చెప్పిన విధంగా అదే జరిగింది. కానీ ప్రస్తుతం జరిగింది మరో విచిత్రం ఏమిటంటే ప్రజల వద్ద రేషన్ బియ్యాన్ని (పీడీఎస్) తరలించి అక్రమాలు చేసిన వ్యక్తులకు, నియామక ఉత్తర్వులు ప్రకారం ఏమీ ఉంటే అనర్హత ఉంటుందో వారికి, ప్రభుత్వా నియమ నిబంధనలకు వ్యతరేకంగా వ్యాపారం చేసిన వారికి, అలాగే ప్రభుత్వ అధికారుల ముందస్తు సూచనల మేరకు పరీక్ష పత్రంలో ప్రశ్నలకు సమాధానం ఎలా రాయలో, వదలాలి అని కూడా చెప్పి, పుట్టుకతో వ్యాపారం చేస్తున్న వాళ్లకు లక్షల పరిహారం చెల్లించిన వారికి డీలర్షిప్ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానంపల్లీ గ్రామాల్లో కూడా అదే జరిగింది అని సమాచారం. అలాగే పరీక్ష రాసిన అభ్యర్థులు వారిలో పరీక్ష రాసిన తర్వాత వచ్చిన మార్కులు ప్రకటించి అందులో నుండి ఎక్కువ మార్కులు వచ్చిన వచ్చిన వారిని మాత్రమే ఇంటర్వూ కి పిలిచి ఇంటర్వ్యూలో ఎవరయితే వారికి కేటాయించాలి. లేదంటే మాకు న్యాయం జరిగేంత వరకు ఎంతదూరమైన వెళతాం అని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment