2023-24 ఏడాదికి ఆదాయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు నాలుగో స్థానం
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్అక్టోబర్ 07:
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆదాయంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2023-24 ఏడాదికి సంబంధించి ఎక్కువ ఆదాయం పొందిన రైల్వేస్టేషన్ల జాబితాను రైల్వేశాఖ తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో, హౌరా రెండో స్థానం, చెన్నై మూడో స్థానంలో నిలిచాయి. న్యూఢిల్లీ స్టేషన్ నుంచి రూ.3,337 కోట్ల ఆదాయం రాగా, హైరా స్టేషన్ నుంచి రూ.1,692 కోట్లు, చైన్నై సెంట్రల్ నుంచి రూ.1,299 కోట్లు, సికింద్రాబాద్ నుంచి రూ.1,276 కోట్ల ఆదాయం సమకూరింది.