హ్యూమన్ రైట్స్ టుడే/ఇంటర్నెట్ డెస్క్/అక్టోబర్ 07: పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరుగుతోంది. అటు ఇజ్రాయెల్, ఇటు హెజ్బొల్లా, హమాస్‌లు ఎవరికి వారు వెనక్కి తగ్గకపోవడంతో దాడులు, ప్రతి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 10 మంది మృతి చెందినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. బారాషీట్‌లోని అగ్నిమాపక కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతున్న సమయంలో రెస్క్యూ మిషన్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్న 10 మంది మరణించారు.