హ్యూమన్ రైట్స్ టుడే/మేడ్చల్/అక్టోబర్ 07: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్ఐ. మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏసీబీ దాడులు చేశారు. రూపాయలు 50 వేల లంచం తీసుకుంటూ అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఏఎస్ఐ దొరికాడు. ఓ కేసుకు సంబంధించి స్టేషన్ బెల్ విషయంలో రూపాయలు 50 వేలు డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఎస్ఐ మధుసూదన్ ను విచారిస్తున్నారు.