హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 07: వరద సాయంగా రూ.11,713.49 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆగస్టు 31 నుంచి నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయని సీఎం తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎస్‌డీఆర్ఎఫ్ మొదటి, రెండో విడతల కింద తెలంగాణకు రూ.416.80 కోట్లను మాత్రమే కేంద్రం విడుదల చేసిందని ఆయన చెప్పారు.