హ్యూమన్ రైట్స్ టుడే /భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం లో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో “ఆబాద్” పార్టీ అధ్యక్షులు హసన్ షేక్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనులు బ్రిటిష్ వారితో పోరాడి సాధించిన స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమన్యాయంతో అందాలనే ఆకాంక్షతో వివిధ దేశాల నుండి రాజ్యాంగాలను క్రోడీకరించి ప్రపంచంలోనే ఎక్కడా లేని ఒక గొప్ప రాజ్యాంగాన్ని మన మహానీయులు రచించడం జరిగింది. ఈ రాజ్యాంగంలో మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మన దేశంలోని వివిధ జాతుల యొక్క పరిరక్షణకు ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎలా చేస్తే సమాజంలో సామాజిక న్యాయం ,సాంఘిక న్యాయం ఆర్థిక సమానత్వం స్వేచ్ఛ, సౌభాతృత్వం, మొదలగునవి సాధ్యం అవుతాయి అని ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రచించారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మనం అందరం గమనిస్తూ ఉన్నాం. అలా కాకుండా చట్టం ఎవరికి చుట్టం కాదు అనే విధంగా ప్రభుత్వాలు పని చేసినప్పుడు దేశంలోని నిరుపేదలకైన, ధనికులకైన సమాన న్యాయం జరుగుతుందని భావనను కల్పించిన వాళ్లం అవుతామని తెలియ చేస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా అమలు చేయడానికి భవిష్యత్తులో “ఆబాద్” పార్టీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దినకర్, రమేష్ సౌమ్య, ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.