హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 07: గల్ఫ్ మృతుల కుటుంబాలకు పరిహారంపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ లలో మరణించిన కార్మికుల కుటుంబాలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మరణించిన 6 నెలల్లోపు కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు దరఖాస్తు చేయాలని సీఎస్ ఉత్తర్వులిచ్చారు.