హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 07: దేశానికి రోల్ మోడల్‌గా ఉండేట్లు కొత్త రెవెన్యూ చట్టం-2024ను తీసుకురానున్నట్లు తెలంగాణ రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్‌తో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల నుంచి విముక్తి చేసేందుకు వీలుగా ఈ చట్టం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆదివారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమావేశమయ్యారు.