టెర్రరిస్టుల కోసం ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు..
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/అక్టోబర్ 07: ఢిల్లీలో నిఘా విభాగం అధికారులు సోమవారం హైఅలర్ట్ జారీ చేశారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసుల సమాచారం. దీంతో ఉగ్రవాదులు భారీ దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలోని మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారీ కుట్రకు పథక రచన చేసినట్లు ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్, తనిఖీలను పెంచాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశాయి. విదేశీ పౌరులను రక్షణ కవచంగా ఉపయోగించు కునేలా ఉగ్రవాదులు వ్యూహాలు సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
కొన్ని ఉగ్రముఠాలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని నిఘా విభాగం తెలిపింది. కొన్ని దేశాల ఎంబసీలను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం.
నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాలతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.