హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 07: నేడు ప్రపంచ పత్తి దినోత్సవం. పత్తి యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను గుర్తించడంతో పాటు పత్తిపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది అక్టోబర్ 07 న ప్రపంచ పత్తి దినోత్సవం జరుపుకుంటారు. పత్తికి మంచి భవిష్యత్తును కల్పించడం ప్రపంచ పత్తి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాకుండా పత్తిని సాగు చేసే రైతులు, కూలీలు, వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచడం కోసం ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తారు.