నీటి బకాయిలపై వన్ టైమ్ సెటిల్ మెంట్..

Get real time updates directly on you device, subscribe now.

హైదరాబాదీలకు శుభవార్త.. మళ్లీ ఓటీఎస్..

నీటి బకాయిలపై వన్ టైమ్ సెటిల్ మెంట్..

ఆలస్య రుసుముతో పాటు వడ్డీ మాఫీ..

ఈనెల 1 నుంచి 31 వరకు అమలు..

పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తేనే పథకం వర్తింపు..

సద్వినియోగం చేసుకోవాలన్న వాటర్ బోర్డు..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 06: తాగునీటి బకాయిలు చెల్లింపునకు వాటర్ బోర్డు చక్కటి అవకాశం కల్పించింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలపై విధించిన ఆలస్య రుసుము, వడ్డీని మాఫీ చేస్తూ వన్టైం సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీ ఎస్)ను ప్రకటించింది. బకాయిలు పూర్తిగా చెల్లిస్తేనే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీచేశారు. దసరా పురస్కరించుకొని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాగా… ఈనెల 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

బకాయిలు తగ్గించేందుకు..

వాటర్ బోర్డులో నీటి బకాయిలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో వాటిని తగ్గించేందుకు ఓటీఎస్ ను అమలు చేయాలని వాటర్ బోర్డు గతనెల 19న ప్రభుత్వానికి లేఖ రాయగా, అందుకు అనుమతులిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరిం చింది. ఓటీఎస్ కింద వినియోగదా రులు తమ బకాయిలను ఎలాంటి

ఆలస్య రుసుం, వడ్డీ లేకుండా చెల్లిం చవచ్చు. ఈ పథకాన్ని గతంలో 2016లో, మళ్లీ 2020లో అమలుచేశారు. ఒక్కో విడతలో రూ.400 కోట్లకుపైగా బకాయిలు వసూలు య్యాయి. అయితే నీటి బిల్లుల బకా యిలపై వడ్డీ మాఫీ కోసం అధికా రుల స్థాయిని బట్టి పరిమితి నిర్ణయించారు. మేనేజర్ స్థాయిలో రూ.2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనే జర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారం ఉంది. ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాటర్ బోర్డు ఎండీ ఆశోక్ రెడ్డి వినియోగదారులకు సూచించారు.

ఓటీఎస్ నిబంధనలు ఇలా..

ఓటీఎస్ ఈనెల 31 వరకు మాత్రమే అమల్లోఉంటుంది.

నల్లా కనెక్షన్ యాక్టివ్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

గతంలో ఓటీఎస్ ను వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే అలస్య రుసుము, వడ్డీ మాఫీ అవుతాయి.

ఒకవేళ గతంలో ఓటీఎస్ ను వినియోగించుకుంటే 50% మాఫీ అవుతుంది.

ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వారు భవిష్యత్తులో 24 నెలలపాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని ఆఫిడవిట్ ఇవ్వాలి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment