మూసీ నిర్వాసితులకు అండగా సర్కార్.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 06: మూసీ నిర్వాసితులకు అండగా సర్కార్ విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీ వేసి మూసీ నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ఫ్ సీఈవో ఛైర్మన్గా, జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ ఛైర్మన్గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.