ఈ తీరు ఇంకెన్నేళ్లకు మారునో…!
పేరుకే పధకాలు.. ఆచరణలో సూన్యం (ఇంటింటికి రక్షిత మంచి నీటి కుళాయి పధకం)..
నివగాం ఎస్ సి వీధి వద్ద మురికి కాల్వల మద్యలో మంచి నీరు పడుతున్న మహిళలు..
అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ దృశ్యం..
ప్రభుత్వాలు మారిన ఫలితం లేదు.. వారి కష్టాలు తీర్చే వారే కరువయ్యారు?
ఓట్లు అవసరం ఐనప్పుడు గుర్తొచ్చిన మేము ఇప్పుడు మీకు గుర్తుకు రావటం లేదా??? అని ఆరోపణలు..
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/అక్టోబర్ 06: పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం నివగాం గ్రామంలో స్థానిక ఎస్సీ వీధిలో మంచి నీటికోసం మహిళలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇక్కడి స్థానిక ప్రజలు మంచి నీటికోసం మురికి కాల్వలో దిగాల్సిందే. వీరి పరిస్థితి చుస్తే చాలా దయనీయంగా ఉంది.ఇలాంటి వాతావరణంలో నిజంగా జనావాసాలు ఈ రోజుల్లో కూడా జీవిస్తున్నారా? అంతే నిజమే అనటానికి ఇదో తార్కాణం.
నివగాం గ్రామం ఎస్సీ వీధిలో స్థానిక మహిళలు మురికి నీటి కాల్వల మద్య మంచి నీటి కుళాయి దగ్గర తాగటానికి మంచి నీరు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు వీరి కష్టాలను చూసి చూడనట్లుగా వ్యవహారిస్తున్నారని స్థానిక మహిళలు తమ గోడును వెల్లడించారు. అలాగే ఇక్కడ మంచి నీరు తాగటం వలన మేము ఎన్నో రకాల అనారోగ్యాలకు గురి అవుతున్నామని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా కష్టాలు తీరటం లేదని ఇకనైనా మా బాధను అర్థం చేసుకొని తక్షణమే చర్యలు తీసుకొని మాకు మంచి నీటి కష్టాలు తీర్చమని స్థానికులు కోరుకుంటున్నారు.
– రవికుమార్