హ్యూమన్ రైట్స్ మీడియా ఛానల్ ప్రచురణకు స్పందన…
ప్రశ్నించే గళం బాధ్యతా వహించే విలేకరులకు ఎప్పుడూ అండగా హ్యూమన్ రైట్స్ మీడియా…
ఈరోజు (6-10-2024) ఉదయం 11 గంటలకు బహిరంగ విచారణకి ఒప్పంద పంచాయతీ కార్యదర్శులకు, మీడియాకు, అధికారులకు ఆహ్వానం..
అవాకులు, చవాకులు పేలడం కాదు దమ్ముంటే బహిరంగ విచారణకు సిద్ధం..
సూసైడ్ నోట్ కు స్వీయ విచారణకు నేను సిద్ధం.. అసమర్ధ పంచాయతీ కార్యదర్శుల కాల్ రికార్డ్ ల విచారణకు సిద్ధమా…
తట్టుపల్లి పంచాయతీ కార్యదర్శి కాల్ డేటా తీస్తే… అజ్ఞాత నియోజకవర్గ ఉన్నత స్థాయి నేత కుట్ర బయట పడుతుంది..
ఆత్మ హత్య యత్నం చేయడం కాదు ప్రజల సమస్యలు పరిష్కారం చూపి ప్రజల మన్ననలు పొందండి..
పంచాయతీ కార్యదర్శులు మీకు హక్కులు ఉన్నాయి… బాధ్యతలు ఉన్నాయి. సమస్యలు ఉంటే ప్రజలు ఎక్కే తొలి మెట్టె మీరు..
ఎవరి ప్రాపకం కోసమో ప్రశ్నించే గొంతుకలను బ్లాక్ మెయిల్ చేయిద్దు.. మీలో నిజాయితీ, నిబద్దత ఉంటే మీరు అదే పద్దతిలో పోరాటం చేయండి..
ఆత్మ హత్యలు… ఆత్మ హత్య యత్నాలు సమస్యలు పరిష్కారం చూపవు…
ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం చూపిన కురవి మండలంలోని కార్యదర్శులను జిల్లా కలెక్టర్ బేషరతుగా సస్పెండ్ చేయాలి.
జిల్లాలో సైతం ఇదే బ్లాక్ మెయిల్ చేస్తున్న ఒప్పంద పంచాయతీ కార్యదర్శుల వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి..
ప్రతి గ్రామంలో ప్రజలు పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై నిఘా పెట్టండి…సమాచార హక్కు చట్టం ఉపయోగించుకొని అవినీతి చేస్తున్న వారి భరతం పట్టండి..
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్/అక్టోబర్ 06: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామంలో ఓటరు జాబితాలో వార్డు ఓటర్స్ ను గందరగోళం చేసి గతంలోని వార్డ్ రిజర్వేషన్ రోస్టర్ మార్చివేసిన గ్రామ కార్యదర్శిపైన నేను నా స్వంత గ్రామం కనుక ఒక జర్నలిస్ట్, రాజకీయ వేత్తగా రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ కమిషనర్, పంచాయతీ రాజ్ మంత్రి, జిల్లా కలెక్టర్ కి, మండలంలోని అధికారులకు పిర్యాదు చేయగా వారు విచారణ జరిపి కొంత మేరకు ఓటరు జాబిత సవరణ చేశారు. ఆ తరువాత మండలంలో ఎన్నికల విధులు నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శులు 7 గురిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవడం కోసం కురవి మండలం పరిషత్ అధికారి సంజాయిషి నోటిస్ ఇవ్వడంతో, సస్పెండ్ అవుతామనే భయంతో ఆయా కార్యదర్శులు ఒక పథకం ప్రకారం తట్టుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి అయిన నాగశ్రీతో నేరడ క్రాస్ రోడ్ వద్ద ఉండి ఆత్మ హత్య పథకం వేశారు. దానిలో భాగంగా దోమల నివారణ కోసం ఫాగింగ్ చేసే రసాయనం త్రాగినట్లు తట్టుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నటించడం, దానికి మిగతా షోకేజ్ నోటీసులు అందుకున్న కార్యదర్శులు ఈ నాటకాన్ని రక్తి కట్టించడం జరిగింది. ఈ విషయంలో నేను వేధించినట్లు ఒక నోట్ రాసి అందులో నాతో పాటు అధికారులు సైతం వేదిస్తున్నారు అని సూసైడ్ విడుదల చేయడం, ఈ విషయం పట్టుకొని ఒప్పంద పంచాయతీ కార్యదర్శుల సంఘం అంటూ కొందరు, మండల పంచాయతీ కార్యదర్శుల సంఘము అంటూ ఇంకొందరు, కాంగ్రెస్ పార్టీ లోని డా.రామచంద్రు నాయక్ అనుచరులు కొందరు నాపై పథకం ప్రకారం ఆరోపణలు చేస్తున్నారు.
నాపై ఆరోపణలు చేస్తున్న వారెవరు అయిన ఈరోజు (6-10-2024) ఆదివారం ఉదయం 11 గంటల నుండి బహిరంగ విచారణ కోసం తట్టుపల్లి గ్రామం రావాలి..
ఎన్నికల నియామవళి ప్రకారం నడుచుకోవడం అధికారుల పని ఎన్నికల ప్రక్రియలో చిన్న, పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేసిన అది పెద్ద సమస్య అవుతుంది. అందుకోసం రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాయి. పొరపాటు చేసిన ఎవరినైనా వారు వదలరు అనేది పాపం ఈ అసమర్ద పంచాయతీ కార్యదర్శులకు తెలియదు. అందుకే తప్పులు చేసి దొంగే దొంగ అంటూ అరుస్తున్నారు. తట్టుపల్లి గ్రామ కొందరు రాజకీయ నాయకులతో కలిసి ఓటరు జాబిత గందరగోళం చేసి ప్రజాస్వామ్య ప్రక్రియకి విరుద్ధంగా పని చేసిన కార్యదర్శులను అధికారులకు సంజాయిషీ నోటీసులు ఇస్తే తప్పేంటి గ్రామంలో ఓటర్స్ విభజన తప్పుల తడఖగా ఉంటే పై అధికారులకు పిర్యాదు చేస్తే అసమర్ధత కలిగిన, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని చేయని అధికారులు బ్లాక్ మెయిల్ చేస్తే బాధ్యత కలిగిన వారు ఊర్కోవాలా ఆత్మ హత్య యత్నం నాటకలు ఆడితే మీ తప్పు ఒప్పు అవుతుందా అసమర్ధ పంచాయతీ కార్యదర్శులు. మీ గ్రామాలకు రండి మీరు గ్రామాల్లో ప్రజల మధ్య ఎలా ఉంటున్నారో చెపుతాను. గ్రామ నిధులు ఎలా వాడుతున్న విధం తెలుసుకోవాలి అంటే ఒక్క సమాచార హక్కు దరఖాస్తు, లోకాయుక్త చాలు మీరేంటో నేను ఎంటో తెలుసుకోవడం కోసం. గ్రామాల్లో ప్రజల మధ్య మమేకం అవుతూ సేవ చేసే మీరు అవినీతి పరులుగా, గ్రామాల్లో ఉండకుండా, పని చేయకుండా అసమర్ధత కలగిన మిమ్మల్ని ప్రశ్నిస్తే వారిని బ్లాక్ మెయిల్ చేసేందుకు మీరు, మీ సంఘాలు ఉన్నాయా, ఉడుత ఊపులకు భయపడి నేను పారి పోతనని మీరు అనుకుంటే పొరపాటు. నాపై నిందలు వేసిన ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. మీరు మీ గ్రామాల పనితీరుపై ఈరోజు నుండి నేను నిఘా పెడుతున్న వేచి చూడండి. నీతి, నిజాయితీ ఎవరిదో తేల్చుకుందాం.
*డి. వై. గిరి.*
ఇండిపెండెంట్ జర్నలిస్ట్
మహబూబాబాద్ జిల్లా
సెల్ : 7013667743