చంద్య తండా గ్రామపంచాయితీ లో వెలగని వీధిలైట్లు..
చీకటి మయంగా తండా….
పట్టించుకోని గ్రామపంచాయతీ కార్యదర్శి…
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్/అక్టోబర్ 06: మహబూబాబాద్, కురవి మండలం, తట్టుపల్లి, చంద్యా తండా గ్రామపంచాయితీలో వెలగని వీధి లైట్లతో ఇబ్బందులు పడుతున్నామని తండా వాసుల ఆవేదన. తండాలో ఎటు చూసినా చీకటి మయంగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బందికరంగా జీవిస్తున్నారు. రాత్రుల్లో బయటకి వెళ్ళాలంటే బయపడుతున్నమని మా ఇబ్బందులు, బాధలు ఎవరు పట్టించుకోవడం లేదని, తక్షణమే వీధిలైట్లు అమర్చాలి లేనియెడల తండా ప్రజలు, యువజన సంఘాలు అందరం కలిసి ఎంపీడీవో ఆఫీస్ ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.