కేసీఆర్ ఫామ్‌హౌస్ దగ్గర దీక్ష చేస్తా: జగ్గారెడ్డి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 06: ఆనాడు దొంగ మాటలు చెప్పి కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. ‘హరీశ్ రావు రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటున్నాడు. రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే ఊరుకుంటామా? నువ్వు, నీ మామ మోసాల కుటుంబం.. ప్రజలను మోసం చేసినందుకు కేసీఆర్ ఫామ్‌హౌస్ దగ్గర దీక్ష చేస్తా. నువ్వు ఢిల్లీ పోయిన రోజే.. నేను మీ మామ ఎక్కడుంటే అక్కడ దీక్ష చేస్తా’ అని ఫైర్ అయ్యారు.