దగా కోరు బిజెపిని నిలదీయండి ఎస్సీ వర్గీకరణ సాధనకై ఉద్యమించండి ..!

Get real time updates directly on you device, subscribe now.

మాదిగ దండోరా జాతీయ అధ్యక్షుడు సర్దార్ మేడి పాపన్న మాదిగ పిలుపు
మాదిగలను మోసం చేస్తున్నా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి….!
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు సర్దార్ మేడి పాపన్న మాదిగ పిలుపు
బిజెపి మోసాన్ని ఎండగడుతూ ఉద్యమించండి ….

హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ : ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎం.ఆర్.మ్. ఎస్. 28 సంవత్సరాలుగా పోరాటం చేస్తుందనీ ఈ పోరాటాలకు దేశంలోని అన్ని
రాజకీయ పార్టీలు మద్దతును ఇచ్చాయనీ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ పేర్కొన్నారు. ఈ సామాజిక న్యాయ ఆకాంక్షను వ్యతిరేకించిన వాళ్ళు దేశంలో లేరంటే అతిశయోక్తి కాదనీ పాపన్న మాదిగ పేర్కొన్నారు.

1997 నుంచి ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం బీజేపీ మద్దతు ఇచ్చిందనీ, అనేక సభలలో ఆ పార్టీ నాయకులు
వెంకయ్యనాయుడు నుండి మొదలు అనేక మంది జాతీయ రాష్ట్ర ప్రధాన నాయకులు తమ సంఘీభావాన్ని ప్రకటించారనీ,. చట్ట సభల లోపల, వెలుపల అనుకూలంగా మాట్లాడారని.. పాపన్న మాదిగ గుర్తు చేశారు. 2014లో జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వంద రోజులలో sc వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని బిజెపి ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటించిందనీ,, ఐదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి వర్గీకరణ బిల్లును పట్టించుకోలేదనీ, తిరిగి 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నాలుగేళ్ళు గడిచినా వర్గీకరణ బిల్లు గురించి ఉసెత్తడం లేదనీ,. వందరోజుల హామీనీ గంగలో కల్పిందనీ. Mrps, దాని అనుబంధ ఎస్సి ఉప కులాల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మాదిగ ప్రజల జిల్లా మహాసభ… మాదిగల లొల్లి కార్యక్రమంలో మాట్లాడుతూ సర్దార్ మేడిపాపన్న మాదిగ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం నుండి బిజెపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి Mrps నిర్వహించి అనేక కార్యక్రమాలలో పాల్గోని వర్గీకరణకూ అనుకూలంగా మాట్లాడారనీ,. పక్షం రోజులలో, నెల రోజులలో వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు ,. కానీ వెంకయ్య నాయుడు మాటల లాగానే కిషన్ రెడ్డి మాట కూడా నీటి మిద రాతవలె మిగిలి పోయిందనీ.. మాదిగల లొల్లి మహాసభలో మాట్లాడుతూ సర్దార్ మేడిపాపన్న ఆరోపించారు.

బీజేపీ చెప్పిన మాటలకు, చేసి చేతలకు పొంతన లేకుండా పోయిందనీ, ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో బీజెపి
మాదిగలకు ఒరగ పెట్టింది శూన్యమనీ, మాదిగ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చకుండా, sc వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా.. మోసం చేసిన చరిత్ర బీజేపీదేననీ దేశవ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ ఉపకులాల ,మాదిగల మహాసభలో మాట్లాడుతూ సర్దార్ మేడి పాపన్న మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బాబ్రీ మసీదు, కాశ్మీరు వంటి విషయాలలో దేశంలో అనేక నిరసనలను లెక్కచేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకునీ తాము అనుకున్నదే చేశారని, కోర్టుల ద్వారా కూడా అదే ంతీర్పు వచ్చేటట్లు పరిష్కారం చేశారని,, సర్దార్ మేడి పాపన్న మాదిగ పేర్కొన్నారు.కానీ మూడు దశాబ్దాలుగా మాదిగలు, ఎస్సి ఉపకులాల ప్రజలు చేస్తున్న న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన పోరాటాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదని అధికారంలో రాకముందు మద్దతు ప్రకటించిన నేతలే ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారని సర్దార్ మేడి పాపన్న మాదిగ ఆరోపించారు.

ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలలోని 59 కులాలకు సమానంగా పంపిణీ చేయాలని గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా Mrps పోరాడుతున్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రు ల తో పాటు భారత ప్రధానమంత్రి పెద్ద మనసుతో గుర్తు పెట్టుకోవాలని సర్దార్ మేడి పాపన్న మాదిగకోరారు మాదిగ ఉప కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని,, మాదిగల లొల్లి మహాసభలో పాపన్న మాదిగ బిజెపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేల సంవత్సరాల అంటరానితనం, అణిచివేత వల్ల దళితులు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలకు దూరమయ్యారనీ, మనదేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రూపొందాలంటే సామాజిక న్యాయం ఒక షరతుగా ఉండాలని మాదిగమహాసభలో సర్దార్ మేడి పాపన్న మాదిగ అభిప్రాయపడ్డారు. అందుకే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు నూ పొందుపర్చారనీ,. దీని కోసం మాదిగ దండోరా గత 30 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చిందని, కాని కేంద్ర , రాష్ట్ర పాలకులు రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం లేదనీ మాదిగ దళపతి సర్దార్ మేడి పాపన్న మాదిగ పేర్కొన్నారు.
నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న బిజెపి ప్రభుత్వంపై దేశంలో ఉన్న మేధావులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎస్సీ వర్గీకరణల విషయమై ఒత్తిడి పెంచాలని తక్షణమే పార్లమెంట్లో బిల్లు పెట్టి మాదిగలకు ఎస్సీ ఉప కులాల ప్రజలకు న్యాయం చేయాలని సర్దార్ మేడి పాపన్న మాదిగ విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో బిజెపి మోసాన్ని ఎండగడుతూ దేశవ్యాప్తంగా గల్లి గల్లి నుండి ఢిల్లీ వరకు ఢిల్లీ రైతాంగ ఉద్యమ తరహాలో మాదిగల మిలిటెంట్ పోరాటం నిర్వహించగా తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని మాదిగల లొల్లి మహాసభలలో సర్దార్ మేడి పాపన్న మాదిగ హెచ్చరించారు. జ్ఞానం ,ధైర్యం ,త్యాగం నినాదాలుగా లక్షల మంది మాదిగ విద్యార్థి, యువజన ,ప్రజాసైన్యం బిజెపి మోసాన్ని ఎండగడుతూ దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు సర్దార్ మేడి పాపన్న మాదిగ పిలుపునిచ్చారు.


ఇప్పటికైనా మాదిగ ప్రజలు ఏకమై పోరాటానికి సిద్ధం కావాలనీ,. ఎస్సీ వర్గీకరణ పిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించే వరకు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని ఉపళ్ళురుతున్న బీజేపీ నేతలను మాదిగ ప్రజలు గ్రామ, గ్రామాన నిలదీయాలనీ మాదిగ వాడలలోకి, గూడాలలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలనీ, కుల ఆధిపత్యాన్ని మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ ఏరకంగా చూసిన మాదిగలకు, దళితులకు వ్యతిరేకమైనదనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనీ, తెలంగాణలో బీజేపీకి చెందిన పార్లమెంట్ సభ్యులను మాదిగ ప్రజలు అడుగడుగునా నిలదీయాలని మాదిగల లొల్లి మహాసభలో సర్దార్ మేడిపాపన్న పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి చురక తగులుతుందని,
పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాడానికి అవుతుందని వంగపల్లి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టి.ఆర్.ఎస్ పార్టీ 2014లో మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందనీ, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ తీర్మానాన్ని చెత్త బుట్టలో వేసిందనీ,. తెలంగాణ హైకోర్టును సాధించుకోవడానికి చట్ట సభల లోపల, బయట అనేక పోరాటాలు చేసిన టి.ఆర్.ఎస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ విషయంలో మాత్రం ఉదాసీనంగా ఉండిపోయిందనీ మేడి ఆరోపించారు. కేవలం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇవ్వడా నికే పరిమితమయింది తప్పు ప్రత్య కార్యాచరణకు దిగలేదని మేడి విమర్శించారు. . ఎస్సీ రెజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా ఉండటం వలనా ఇంతకాలం పాటు ఎం.ఆర్.పి.ఎస్. తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నదనీ, మాదిగ ప్రజల ప్రయోజనం కోసం, హక్కుల సాధన కో టి.ఎం.ఆర్.పి.ఎస్, టీ.ఆర్.ఎస్ పార్టీతో స్నేహపూర్వకంగా ఉన్నదనీ, మద్దతు ఇచ్చిందనీ, ఇప్పటికైనా టి.ఆర్.ఎస్ పార్టీ కూడా వర్గీకరన కోసం ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాలని సర్దార్ మేడి పాపన్న మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేశారు.


సామాజిక న్యాయం అంటే సమాన పంపిణేననీ సర్దార్ మేడి పాపన్న పేర్కొన్నారు.


గల్లి గల్లి నుండి ఢిల్లీ వరకు దండోరా వేసీ వర్గీకరణ సాధించేవరకు పోరాటాన్నీ ఆపమని గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన మాదిగ కవులు కళాకారులు తమ సాంప్రదాయక డప్పు కళాకారుల ఆటలు,పాటలు నృ త్యా లూ వర్గీకరణ లక్ష్యంగా మాదిగల లొల్లి మహాసభలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్, జిల్లా ప్రెసిడెంట్ మోహన్ గారు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment