1998 డీఎస్సీ బాధితుల మోర రెండు దశాబ్దాలకు పైగా ఎదురు చూస్తున్న..
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/అక్టోబర్ 05:
1998 డీఎస్సీ బాధితుల మోర రెండు దశాబ్దాలకు పైగా ఎదురు చూస్తున్న, తమ కళా సహకారం చేయాలని 1998 అర్హులు ప్రభుత్వన్ని కోరుతున్నారు. మంగళవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిజామాబాదులో టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల సంజీవ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ 1998లో ఉపాధ్యాయ నియామకల్లో అధికారులు అనేక అవకతవకలకు పాల్పడి, అర్హులైన అభ్యర్థులను నియామకం చేయకుండా అక్రమ మార్గాల ద్వారా కొంతమంది నాన్ లోకల్ అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించడం జరిగిందని అన్నారు. మానవతా దృక్పథంతో ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.
డీఎస్సీ 98 క్వాలిఫై టీచర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డి.ఎల్.యన్.చారి మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం డీఎస్సీ 98 క్వాలిఫైడ్ టీచర్స్ కు తీరని అన్యాయం చేసిందని అన్నారు. దశాబ్దాల కాలంపాటు ఎదురు చూసిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం క్వాలిఫైడ్ బాధితులు పట్టించుకున్న పాపాన పోలేదు. 1998లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో నిర్వహించిన 1998 మెగా డీఎస్సీ అవినీతి అక్రమాల పుట్టగా మారింది. 98 మార్చ్ నుండి 2000 మార్చి వరకు 1998 డీఎస్సీ ప్యానెల్ అమలు కావలసిన కాలంలో జనరల్ రిటైర్మెంట్స్ మరియు ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీల సంఖ్యను మొత్తం లెక్కించి 98 డిఎస్సి వెయిటింగ్ అభ్యర్థులకు కేటాయించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు 4567 మందికి యం.టి.ఎస్. పద్ధతిలో జీవో ఎంఎస్ నం.27 (2023మార్చ్ 15) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వయోపరిమితితో సంబంధం లేకుండా స్పెషల్ కేసుగా పరిగణించి న్యాయం చేస్తానన్న అప్పటి సీఎం కేసీఆర్ కూడా మాట నిలబెట్టుకోలేదు. రెండు దశాబ్దలకు పైగా ఎదురు చూస్తున్న తమ కళా సహకారం చేయాలని 1998 డియేస్సి అర్హులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి శ్రీనివాస్, శ్రీరామోజు కిషన్, నాగుల్ పేట్ ప్రతాప్, రాజేందర్, శ్రీనివాస్, కిషన్, లింబాద్రి, జహురిద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.