మహిళపై 72 మంది అత్యాచారం చేసిన కేసులో వీడియో ఆధారాలు చూసేందుకు ప్రజలకు అనుమతి..
హ్యూమన్ రైట్స్ టుడే/ఇంటర్నెట్ డెస్క్/అక్టోబర్ 05: మహిళపై 72 మంది అత్యాచారం చేసిన కేసులో వీడియో ఆధారాలు చూసేందుకు ప్రజలకు అనుమతి
ఫ్రాన్సులో ఓ వ్యక్తి తన భార్యకు డ్రగ్స్ ఇచ్చి దశాబ్దం పాటు 72 మందితో ఆమెపై లైంగిక దాడి చేయించాడు. వాటిని చిత్రీకరించాడు. ఈ కేసు విచారణలో అక్కడి న్యాయమూర్తి సంచలన నిర్ణయం వెలువరించారు. వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నప్పుడు కోర్టులో ఉన్న సాధారణ పౌరులు కూడా చూడొచ్చని వెల్లడించారు. అయితే ఆ సమయంలో సున్నిత మనస్కులు, మైనర్లు కోర్టు పరిసరాల్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే కచ్చితంగా అవసరమైతేనే వాటిని ప్రదర్శించనున్నారు.