ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ మానసికంగా వేధిస్తున్నాడని ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళా పంచాయతీ కార్యదర్శి
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్/అక్టోబర్ 05: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామంలో వంగూరి నాగలక్ష్మి రెండేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంది.
అదే గ్రామానికి చెందిన దొంతు యాదగిరి అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇండిపెండెంట్ రిపోర్టర్ అంటూ, పంచాయతీ కార్యదర్శి వంగూరి నాగలక్ష్మి గ్రామ పంచాయతీలో చేస్తున్న ప్రతి పనిలో కలుగజేసుకుంటూ, ఏడాదిగా తనను మానసికంగా వేధిస్తున్నాడని తన వాగ్మూలంలో పేర్కొంది.
ఈ విషయాన్ని డీఎల్పీవో, ఎంపీడీవో, ఎంపీవోలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇది చూసిన గ్రామంలోని ఆశా కార్యకర్తలు ఆమెను ఆటోలో ఆస్పత్రికి తరలించగా, సమాచారం అందుకున్న డీఎల్పీవో నాగలక్ష్మిని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.