1/70 చట్టాన్ని, పిసా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలి…
LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగూలోతు భీమా నాయక్…
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్: జిల్లా పెద్ధగుడుర్ శుక్రవారం లంబాడ హక్కుల పోరాట సమితి పెద్ద గూడూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు చందులాల్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోతు భీమా నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ గూడూరు మండలంలో వన్నాఫ్ సేవంటి 1/70 చట్టం, పిసా చట్టం అమలులో వున్నప్పటికీ ఇక్కడి అధికారులు, తాసిల్దార్ గారు కొంతమంది దళారులకు సహకరిస్తున్నారని, రియల్ ఎస్టేట్ నడుస్తున్న, బహుళ అంతస్తులు అనుమతి లేకుండానే నిర్మిస్తున్న పట్టించుకోవడంలేదని అన్నారు. వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉన్న గజం భూమి గిరిజనేతరులు 60000, 70000 అమ్ముతున్న పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని, లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. అనుమతి లేకుండానే ఫంక్షన్ హాల్లో అంతస్తుల బిల్డింగులు నిర్మిస్తున్నారని, మామూలకు ఆశ పడుతున్న అధికారులపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, లేనిచో త్వరలోనే పెద్ద గూడూరు నుండి మానుకోట కలెక్టరేట్ వరకు భారీ పాదయాత్ర చేస్తామని తెలిపారు. లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాద్ జిల్లా మూడవ మహాసభలు కొరివి మండల కేంద్రంలో ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహిస్తున్నామని భారీగా గిరిజనులు తరలిరావాలని పిలుపునిచ్చారు. తండాలను గ్రామపంచాయతీలుగా పోరాడి సాధించుకున్నామని, అదేవిధంగా తండాల అభివృద్ధికి కోటి రూపాయలు నిధుల కోసం రెవెన్యూ గ్రామపంచాయతీలుగా గుర్తించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమను నిర్మించాలని మానుకోట జిల్లా కేంద్రంలో స్థాపించాలని గిరిజన యూనివర్సిటీని నిర్మించాలని డిమాండ్ చేశారు. గిరిజన సర్పంచులు గిరిజన ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, మేధావులు ప్రముఖులు హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా వ్యవస్థాపక అధ్యక్షులు బెల్లయ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఇంఛార్జి వినోద్ నాయక్, జాటోత్ మంగీలాల్, శ్రీకాంత్ ,వీరన్న, మంగు నాయక్,బాల్య నాయక్, వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.