రేషన్ డీలర్ల నియామకంలో అనుకున్నదే జరిగింది.. ప్రజలు ఊహించిందే చేసిండ్రు..
అధికార పార్టీ లీడర్లు చెప్పిన వారికే రేషన్ డీలర్ నియామక అర్హత పరీక్షల ఫలితాల అమలు..
పేరుకి అర్హత పరీక్ష దాని వెనకాల అంతా బోగస్..
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/అక్టోబర్ 05: ప్రజలను నిరుద్యోగులను మభ్యపెట్టడానికి వాళ్ళ ఆశలతో వాళ్ళ నిస్సహాయతతో ఆడుకుంటున్న ప్రభుత్వం పూర్తిగా మస్క చీకట్లో అర్హత పరీక్ష నిర్వహించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అని అభ్యర్థుల్లో ప్రజల్లో గుసగుసలు. గత నెలలో వెలువడిన రేషన్ డీలర్ల నియామకం కోసం నోటిఫికేషన్ ప్రకటన నుండి అదే మాట, అదే గుసగుస. నిజామాబాద్ జిల్లాలో రేషన్ డీలర్ల నియామకం కోసం అర్హత పరీక్ష నిర్వహించి అందులో నుండి ప్రతి డీలర్ షాప్ నుండి అధిక మార్కులు వచ్చిన 5 గురిని ఎన్నుకుని ఇంటర్య్వూ కి పిలుస్తమని ప్రకటించారు. అందులో నుండి ఒకరికి నియామకం ఇవ్వబడును అని RDO అన్నారు. కానీ ప్రస్తుతం అర్హత పరీక్ష రాసిన వాళ్ల జాబితాను ఫలితాలను ప్రకటించకుండా ప్రతి ఒక్క షాప్ నుండి ఐదు మంది పేర్లను ప్రకటించారు. అయితే మేము అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశము మరి మా పేర్లు కాకుండా ఏం తెలియని రాయని అభ్యర్థుల పేర్లు ఉన్నాయి అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడో అనుకున్నట్లుగా అధికార ప్రతినిధి, లీడర్లు చెప్పిన విధంగా పేర్లు ప్రక్తించి చేతులు దులిపేసుకున్న రెవెన్యూ శాఖ. దీని వెనకాల మొత్తం ప్రజలు ఊహించినట్టు ప్రజలు ప్రచారం చేసినట్టే జరిగింది. అందులో ఎవరికో ఒకరికి మాత్రమే ఇస్తారు. ఈ నోటిఫికేషన్ దరఖాస్తులు, దానికి ఫీజులు, పరీక్షా, ఫలితాలు, ఇంటర్వ్యూ అంతా బోగస్, అంతా నామ మాత్రంగా ప్రకటించారు. ఎవరు ముందు లీడర్ల ను కలిసి ముడుపులు చెల్లించుకున్నారో వారికే ఇస్తారు. ఇదంత సినిమానే అని మొదటి నుండి ప్రజల్లో గట్టి నమ్మకం, అయితే ఇప్పుడు అదే జరిగింది అని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా రేషన్ షాపు డీలర్లకు నియామకాల్లో అవకతవలపై జిల్లా కలెక్టర్ అధికారులు వెంటనే స్పందించి అర్హత పరీక్ష నిర్వహించిన పద్ధతి ప్రకారం అభ్యర్థుల పేర్లు వారి మార్కుల జాబితా ప్రకటించి, అందులో నుండి అధిక మార్కులు వచ్చిన వారిని ఇంటర్వూ కి పిలవాలని, అవకతవలపై పరిశీలించి ప్రజాస్వామ్యన్ని కాపాడాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.