బాచుపల్లి లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేసిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద.
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 04: గత కొన్ని రోజులుగా నారాయణ కాలేజీలో సమస్యల పట్ల పలు విద్యార్థినిలు మరియు తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో సీరియస్ గా తీసుకున్న కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద బాచుపల్లి లోని నారాయణ కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీ ప్రాంగణంలోనూ విద్యార్థినిల హాస్టళ్లు మరియు మెస్ లను తనిఖీ చేసి నాసిరకమైన ఫుడ్ మరియు హాస్టల్ లలో సౌకర్యాలు సరిగా లేవని గుర్తించి కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. అదే విధంగా అక్కడి విద్యార్థిలతో కాసేపు మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.