మీడియా ముసుగులో సంచరిస్తున్న ఫేక్ గాళ్ళు..? తస్మాత్ జాగ్రత్త!!!
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి గుర్తింపు లేని యూట్యూబ్ నకిలీ గాళ్ళు..
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతీ/గుంటూరు/26 సెప్టెంబర్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి గుర్తింపు లేని యూట్యూబ్ చానల్స్ కు చెందిన 255 నకిలీ గాళ్లు వీరిపై చర్యలు తీసుకోవాలి. కొన్ని మీడియా సంస్థలకి ఎటువంటి గుర్తింపు లేనప్పటికీ ఐడి కార్డ్స్ మంజూరు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఫేక్ గాళ్ళు.
ఓ సిమ్ కార్డ్ తీసుకొని దీని ఆధారంగా ఓ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని ఇదే మెయిల్ తో ఒక యూట్యూబ్ ఐడి క్రియేట్ చేసుకుని, మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో అంటూ వారికి వారే హోదాలు సృష్టించుకొని పైకి బిల్డప్ ఇస్తూ వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ గాళ్ళు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు పొంది ఆర్థిక ఇబ్బందులు వలన కేవలం సోషల్ మీడియాకె పరిమితమై ప్రజా సమస్యలపై నిత్యం ఎప్పటి కప్పుడు ప్రజలను చైతన్యం పరుస్తూ జర్నలిస్టు వృత్తినే దైవంగా భావించే నిజమైన జర్నలిస్టులు మనుగడ కోల్పోతున్నారు.
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ జర్నలిస్ట్ అనే పదానికే మచ్చ తెస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రాష్ట్ర సమాచార శాఖ అధికారులు స్పందించి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఎటువంటి అనుమతులు లేకుండా మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ అంటూ హోదాలు సృష్టించుకుని కార్యాలయాలు ప్రారంభించి ప్రారంభోత్సవాలు వార్షికోత్సవాలు క్యాలెండర్ యాడ్స్ అంటూ వివిధ కారణాలతో వసుళ్ళకు పాల్పడుతున్న నకిలీగాళ్లపై చర్యలు తీసుకోవాలని నిజమైన జర్నలిస్టుల మనుగడను కాపాడాలని సమాచార శాఖ అధికారులకు పలువురు సీనియర్ జర్నలిస్టులు విజ్ఞప్తి చేస్తున్నారు.