జైలు నుండి విడుదల అనంతరం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..!!
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/14 సెప్టెంబర్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాంలో అరెస్టయి, ఆరు నెలల అనంతరం నేడు బెయిల్ పై జైలు నుండి విడుదల అయిన సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్ జైలు నుండి బయటికి వస్తున్న సందర్భంగా ఆప్ (AAP) నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చారు. వారిని ఉద్దేశించి కేజ్రీవాల్ ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. “నన్ను జైల్లో పెడితే మనో బలాన్ని కోల్పోతానని బీజేపీ నాయకులు భ్రమ పడ్డారు.100 రెట్ల శక్తితో తిరిగి వచ్చాను.
ఇపుడు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నావైపు న్యాయం ఉంది, ప్రజలు కూడా నావైపే ఉన్నారు. ఈ ఆటలో నేనే గెలుస్తాను. దేశం కోసం, ప్రజల కోసమే నా జీవితం అంకితం. ఈ క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోడానికైనా సిద్దంగా ఉంటాను. ఇంత జోరు వానలో కూడా నాకోసం వచ్చిన మీ అందరి ప్రేమకు నా ధన్యవాదాలు” అంటూ కేజ్రీవాల్ ఉద్వేగానికి గురయ్యారు.