నాలుగైదు నెలలలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి..!!

Get real time updates directly on you device, subscribe now.

పంచాయతీల్లో విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితా..!!

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 13: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం అన్ని పంచాయతీల వారిగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు.

గ్రామ పంచాయతీలు, ఎంపీడీవో కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్‌లలో ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రదర్శించడం జరిగిందని, ఓటరు ముసాయిదా జాబితా పై రేపు 14వ తేదీ నుంచి 21 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. 26వ తేదీన వాటిని పరిష్కరించనున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొన్నది.

ముసాయిదా ఓటర్ల జాబితాల సవరణపై ఈనెల 18 తేదీన జిల్లా స్థాయిలో, 19 తేదీన మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటుచేసి వారి సూచనలు, సలహాలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. 28వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని కమిషన్ తన ప్రకటనలో వెల్లడించింది. వచ్చే నాలుగైదు నెలల వ్యవధిలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తొలుత మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు, చివరగా మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే వెల్లడించింది.

ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో 600 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఒక వార్డులోని ఓటరుకు మరో వార్డు పరిధిలో ఓటు హక్కు ఉండకుండా జాగ్రత్త వహించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల ఓట్లు ఒకేచోట ఉండేలా జాబితాలను నిశితంగా పరిశీలించాలని సూచించింది. ఎన్నికల సంఘం సూచనల మేరకు అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment