15నిమిషాల్లోనే ప్రభావం.. అత్యంత చవగ్గా అందు బాటులోకి..!!

Get real time updates directly on you device, subscribe now.

ఇక కళ్లద్దాలు అక్కర్లేదు.. ఈ చుక్కలతో చత్వారం మాయం..

15నిమిషాల్లోనే ప్రభావం.. అత్యంత చవగ్గా అందుబాటులోకి!

అభివృద్ధి చేసిన ముంబై సంస్థ ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్

‘ప్రెసు’ ఐడ్రాప్స్ పేరుతో అందుబాటులోకి..

ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మందికి ఇది శుభవార్తే కంటి చుక్కలు వేసుకున్న 15 నిమిషాల్లోనే ప్రభావం..

కేవలం రూ.350కే అందుబాటులోకి..

హ్యూమన్ రైట్స్ టుడే/ఇంటర్నెట్ డెస్క్/సెప్టెంబర్ 10: ఇక నుండి రీడింగ్ గ్లాసు (కళ్ళద్దలకు) లకు ఇక చెల్లుచీటి చెప్పేయండి. సరికొత్త ఐడ్రాప్స్ త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ దీనికి కేవలం రూ.350కే అందుబాటులోకి అనుమతులు మంజూరు చేసింది. ముంబైకి చెందిన ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ ప్రిస్బియోపియా (దృష్టిదోషం) చికిత్స కోసం ‘ప్రెసు’ ఐడ్రాప్స్ను అభివృద్ధి చేసింది. ప్రిస్బియోపియాతో ప్రపంచ వ్యాప్తంగా 109 కోట్ల నుంచి 180 బిలియన్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. అటువంటి వారికి ఈ డ్రాప్స్ ఎంతగానో మేలు చేయనున్నాయి. ఇది వయసుతో పాటు వచ్చే సమస్య. సాధారణంగా 40 ఏళ్ల వయసులో మొదలవుతుంది. 60 ఏళ్లు వచ్చే సరికి సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్య ఉన్నవారికి దగ్గరి వస్తువులు సరిగా కనిపించవు. ఇప్పుడీ డ్రాప్స్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ తినిచ్చింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు డీసీజీఐ తాజాగా ప్రెస్వు డ్రాప్స్కు అనుమతులు మంజూరు చేసింది. దృష్టిదోషం ఉన్న వారిలో రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గించేందుకు రూపొందించిన దేశంలోనే తొలి కంటి చుక్కలు ఇవేనని కంపెనీ పేర్కొంది. తాజాగా కంపెనీ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కంటి చుక్కలు వేసుకున్న 15 నిమిషాలకే ప్రభావం కనిపిస్తుందని కంపెనీ పేర్కొంది. అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రిస్కిప్షన్ ఆధారంగా మార్కెట్లో ఈ ఐడ్రాప్స్ కేవలం రూ.350కే లభిస్తాయని కంపెనీ తెలిపింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment