రాజేంద్రనగర్ లో ఎదురు కాల్పులు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/క్రైం/సెప్టెంబర్ 10: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో మంగళవారం కాల్పుల కలకలం రేపింది. పోలీసులపై గంజాయి ముఠా కాల్పులు జరపడంతో గంజాయి నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.
గంజాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కూడా వారిపై కాల్పులు జరిపారు. పోలీసులపై ఎదురు కాల్పులు జరుపుతూ గంజాయి ముఠా అక్కడి నుంచి పారిపోయారు.
గంజాయి ముఠాను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయిపై ఉక్కుపాదం మోపిన పోలీసులు పక్కా సమాచారంతో రాజేంద్ర నగర్ కు వెళ్లారు. అయితే పోలీసులను చూసిన గంజాయి ముఠా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు.
దీంతో ముఠాను ఆపేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గంజాయి ముఠా పోలీసులపై ఎదురుదాడికి దిగి పోలీసుల కళ్లుగప్పి పరార్ అయ్యింది.
ముఠా సభ్యులను పట్టుకునేందుకు పోలీసుల పరుగులు పెట్టారు. ఎట్టకేలకు గంజాయి ముఠాను అదుపులో తీసుకున్నారు. పరుగులు పెట్టిన గంజాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో అక్కడి భయానక వాతావరణం చోటుచేసుకుంది.