ఇకపై ఇల్లు నాదే’..దువ్వాడ శ్రీనివాస్‌కు మాధురి బంపర్ ఆఫర్.. మామూలు ట్విస్ట్ కాదుగా..మరీ..
సినిమాలు.. టీవీ సీరియల్స్‌కి ఎండ్ కార్డ్ పడుతుందేమో కానీ..
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/10 సెప్టెంబర్: మన టెక్కలి కొనసాగుతున్న దువ్వాడ కుటుంబ కథా చిత్రామ్ సిరీస్ కు మాత్రం ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేటట్లు లేదు. పూటకో అప్‌డేట్, రోజుకో ట్విస్ట్‌తో సినిమా సిరీస్‌లను మించిపోతోంది.
అయితే ఇప్పటిదాకా చూసిన ఎపిసోడ్స్ ఒక ఎత్తయితే లేటెస్ట్‌గా చోటుచేసుకున్న ట్విస్ట్ సంచలనంగా మారింది.
దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నిరసన వ్యక్తం చేస్తున్న ఇల్లు దివ్వెల మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. టెక్కలి నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటిని దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చారు. అంతే కాదు ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఈనెల 6వ తేదీన మాధురి పేరిట రిజిస్ట్రేషన్ అయ్యినట్లు డాక్యుమెంట్లలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇల్లు మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ కాగానే దువ్వాడ వాణి అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యారు. అదే ప్లేస్‌లో కూర్చున్న మాధురి టీవీ9తో ముచ్చటించింది. దువ్వాడ శ్రీను ఇష్ట పూర్వకంగానే తన పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారంటూ కన్ఫర్‌మేషన్ కోసం రాజాకు లైవ్‌లోనే ఫోన్ కలిపి మాట్లాడించారు. ఈ ఇంటికి సంబంధించిన పూర్తి హక్కులు తనకు వచ్చాయన్నారు దివ్వెల మాధురి. ఇకపై ఈ ఇల్లు నాదే దువ్వాడ శ్రీనివాస్‌ది కాదు అంటూ మాధురి పేర్కొన్నారు.
టెక్కలిలోనే మళ్లీ రాజకీయం చేస్తానన్న దువ్వాడ శ్రీనివాస్‌కు మాధురి బంపర్ ఆఫరిచ్చారు. తన ఇంటి అద్దెకు ఇస్తానని, తిరిగి ఇక్కడికే వచ్చి రాజకీయాలు చేయాలని రిక్వెస్ట్ చేశారు మాధురి. ఈ ఇల్లు ఇప్పుడు లీగల్‌గా తనదేనన్నారు దివ్వెల మాధురి. మళ్లీ వాణి వచ్చి గొడవ చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారామె. తన ఇంటికి రావడానికి వాణి ఎవరని ప్రశ్నించారు మాధురి.
కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నా ఇంట్లోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో దువ్వాడ వాణి నెక్ట్స్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా గత నెల రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న ఈ దువ్వాడ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.