ఆలయంలో మహిళా అఘోరీ..!!

Get real time updates directly on you device, subscribe now.

చర్చనీయాంశంగా ఆలయంలో మహిళా అఘోరీ..!!

హ్యూమన్ రైట్స్ టుడే/సిద్దిపేట జిల్లా/సెప్టెంబర్ 09: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఒక మహిళా అఘోరి దర్శనం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గతంలో పురుష అఘోరాలు ఇక్కడకు వచ్చి స్వామి వారిని దర్శించుకొని వెళ్లేవారు. కానీ ఇటీవల ఓ మహిళ అఘోరి దిగంబరంగా వచ్చి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకో వడంతో ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ అఘోరాలు ఎక్కువగా కాశీలో కనబడతారు. అలాగే శైవ క్షేత్రాల దర్శనానికి ఎక్కువగా వెళుతుంటారు. దానిలో భాగంగానే మహిళా అఘోరి ఆదివారం కొముర వెళ్లి మల్లికార్జున స్వామి దర్శనానికి రావడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఆలయ పరిసరాల్లో దిగంబర మహిళ అఘోరీ సంచరించడం భక్తులు, స్థాని కులు విస్మయం చెందారు. సాధారణంగా అఘోరాల గురించి వింటుంటాం. శివునిపై అపారమైన భక్తితో ఆ దిగంబరునికి తమ జీవితాన్ని అకింతం చేస్తుంటారు. బంధాలు, బంధుత్వాలను త్వజించి శివ నామ స్మరణలో లీనమైపోతుంటారు.

కాశీలాంటి శైవక్షేత్రాల్లో లేదా హిమాలయాల్లో అఘోరాలు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఒళ్లంతా విభూదితో రుద్రాక్ష మాలలతో జటాజూ టాలతో తపస్సులో నిమగ్నమై పోతుంటారు. వీరి జీవనశైలి కూడా సాధా రణ మనుషులకు భిన్నంగా ఉంటుంది. కొందరు అఘోరాలు ఒంటికి బట్టలు చుట్టుకుంటే మరికొందరు మాత్రం దిగంబరులుగానే ఉంటారు.

ఇదంతా మనకు తెలిసిందే. కానీ అఘోరాల్లో మగవాళ్లే కాదు మహిళా అఘోరిలు కూడా ఉంటారన్నది ఇప్పుడు అసలు చర్చ ఎక్కడో కాశీలోనో, హిమాలయాల్లోనో ఉంటే అంతపెద్ద చర్చ కాదు కానీ ఓ మహిళా అఘోరి తెలంగా ణలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లన్న ఆలయం పరిసరాల్లో కనిపించటమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment