గ్రూప్-4 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/05 సెప్టెంబర్: తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల నియామకాలు తుదితీర్పునకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్లకు స్పెషల్ రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2022 డిసెంబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.