నేను ఎవరి వల్ల చనిపోవడం లేదు..

Get real time updates directly on you device, subscribe now.

ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదని.. నవ వధువు ఆత్మహత్య

హ్యూమన్ రైట్స్ టుడే/జగిత్యాల/05 సెప్టెంబర్: పెళైన 17 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల(D) మల్యాల(M) తక్కళ్లపల్లికి చెందిన కనక భాగ్యలక్ష్మి(24)కి మ్యాడంపల్లికి చెందిన ఉదయ్‌ కిరణ్‌ తో ఆగస్టు 18న వివాహం జరిగింది. ఉదయ్‌ కిరణ్‌ హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు సోమవారం కూతురును తక్కళ్లపల్లికి తీసుకొని వచ్చారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మి బుధవారం మధ్యాహ్నం బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె చేతిపై ‘నేను ఎవరి వల్ల చనిపోవడం లేదు నాకే ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదు అందుకే వెళ్లిపోతున్నా’ అని రాసి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment