ఉత్తమ ఉపాధ్యాయులుగా 103 మంది.. నేడు పురస్కారాల అందజేత
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/05 సెప్టెంబర్: తెలంగాణ వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల నుంచి 103 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 47 మంది, ఇంటర్ విద్యాశాఖ నుంచి 11, విశ్వవిద్యాలయాల నుంచి 45 మంది ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో కార్యక్రమంలో పురస్కారాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. ఎంపికైన వారికి రూ.10 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేసి సత్కరించనున్నారు.