హ్యూమన్ రైట్స్ టుడే/ఆదిలాబాద్ /05 సెప్టెంబర్: అదిలాబాద్ జిల్లాకు కొత్తగా నలుగురు తహసీల్దార్లు రానున్నారు. తాజాగా ప్రభుత్వం ఉప తహసీల్దార్లకు పదోన్నతి కల్పించింది. ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న పంచపుల, రఘునాథ్ రావు, గోవింద్, కమల్ సింగ్ లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ కమిషనరు నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఆదిలాబాద్ గ్రామీణం, బేల, సిరికొండ మండలాలతో పాటు కలెక్టరేట్లో తహసీల్దార్ ఖాళీలు ఉండగా కొత్తవారి రాకతో భర్తీ కానున్నాయి.