ఢిల్లీలో కిలో రూ.35 కే ఉల్లిని విక్రయించనున్న కేంద్ర ప్రభుత్వం
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/05 సెప్టెంబర్: పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ వ్యాన్‌లు, నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిటైల్ షాపుల ద్వారా ఢిల్లీలో గురువారం నుంచి సబ్సిడీపై కిలో ఉల్లిని రూ.35కే విక్రయించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.60కి పైగా ఉండడంతో అధిక ధరల నుంచి వినియోగదారులకు విముక్తి కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.