హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/04 సెప్టెంబర్: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో సంభవించిన ఆస్తి, ప్రాణ, పంట నష్టం వివరాలను ఈ వారాంతం లోగా సమర్పించాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బృందాలను క్షేత్ర స్థాయిలోకి వెంటనే పంపించాలని సూచించారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలని సూచించారు.