హ్యూమన్ రైట్స్ టుడే/పుదుచ్చేరి: తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. పుదుచ్చేరిలో మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని యత్నించారు. ఓ శ్రేయోభిలాషి కోర్టుకు వెళ్లడంతో మళ్లీ వేడుకలకు అవకాశం వచ్చింది. గణతంత్ర వేడుకలు ఘనంగా జరపాలని 2 నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశా. దాన్ని పక్కనపెట్టి రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలని 2రోజుల క్రితమే సమాచారమిచ్చారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రం పట్టించుకోలేదు. ప్రసంగ పాఠాన్ని ప్రభుత్వం పంపలేదు’’ అని తమిళిసై అన్నారు.