విశాఖపట్నంలో విచిత్రమైన ఘటన..
మూడేళ్లుగా మహిళ కడుపులో ఉండిపోయిన శిశువు ఎముకల గూడు.. సర్జరీతో బయటకు తీసిన వైద్యులు
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/03 సెప్టెంబర్: మూడేళ్లుగా మహిళ కడుపులో ఉండిపోయిన శిశువు ఎముకల గూడును సర్జరీతో బయటకు తీసిన వైద్యులు
విశాఖపట్నంలో విచిత్రమైన ఘటన జరిగింది. తీవ్రమైన కడుపునొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన కేజీహెచ్ డాక్టర్లు రిపోర్టులు చూసి అవాక్కయ్యారు. ఆమె కడుపులో ఏకంగా 24 వారాల శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే సర్జరీ నిర్వహించి వాటిని తొలగించారు. ఆమె 3 ఏళ్ల క్రితం గర్భం దాల్చాక అబార్షన్ కు మందులు వాడారని, ఆ తర్వాత నుంచి నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు 25 లోపే అని వివరించారు.