హ్యూమన్ రైట్స్ టుడే/తిరుమల: శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త మొబైల్ యాప్ను రూపొందించింది. TTDevasthanam పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. జియో ప్లాట్ఫామ్ ద్వారా తితిదే యాప్ను అభివృద్ధి చేసింది. దీనిలో ఎస్వీబీసీ కార్యక్రమాలు వీక్షించవచ్చని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. యాప్ ద్వారా దర్శనం, గదులు, ఆర్జిత సేవా టికెట్లు బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది. యాప్లో తిరుమల చరిత్ర, స్వామివారి కైంకర్యాల వివరాలను పొందుపరిచింది.