తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ 2 వారాల్లో వివరణ ఇవ్వాలి: సుప్రీం కోర్టు
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/03 సెప్టెంబర్: సీఎం రేవంత్ 2 వారాల్లో వివరణ ఇవ్వాలనీ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి అని సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై సోషల్ మీడియాలో టీ కాంగ్రెస్ చేసిన పోస్టుపై వివరణ ఇవ్వాలని సీఎం రేవంత్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యవహారంలో సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రెండు వారాల్లో రేవంత్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై గత నెల 29న ధర్మాసనం ఆగ్రహించగా రేవంత్ విచారం వ్యక్తం చేశారు.