ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/03 సెప్టెంబర్: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా? అయితే తెలుసుకుందాం రండి. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే శరీర జీవక్రియ రేటు సాధారణం కంటే 30% పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పేగు కదలికలు ఆరోగ్యంగా మారతాయని, అలాగే శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందట. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 4 లీటర్ల నీరు తాగాలని సూచిస్తున్నారు.